సాయి బ్రహ్మానందం గొర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;సాయి బ్రహ్మానందం గొర్తి

సంగీతానికి గుత్తేదారలమంటూ వెలుబుచ్చే వారి అభిప్రాయాలకి అతీతమైంది త్యాగరాజు సంగీతం.

ఒకప్పుడు జాన్ హిగ్గిన్స్ కర్నాటక కచేరీని కూడా హేళన చేసినవారున్నారు. ఇంగ్లీషు వాడవడం వలన ఉచ్ఛారణ బాగో లేదనీ, వేరే మతస్థులు పాడితే త్యాగరాజ కృతులలో వున్న భక్తి భావం కనిపించదనీ సన్నాయి నొక్కులు నొక్కేవారు. అవన్నీ పక్కనబెట్టి ఆయన పని ఆయన చేసుకున్నాడు, పాడగలిగినంతా కచేరీలు చేసాడు.

ఇప్పటిలా సోషల్ మీడియా వంటి వెసులు బాటులు లేకపోవడం వలన ఎవరూ అంతగా పట్టించుకోలేదు;
షేక్ చిన మౌలానా తన నాద స్వరంలో త్యాగరాజ కృతులు అద్భుతంగా పలికించాడు.
సంగీతానికి కులం, మతం ఎప్పుడూ అడ్డు కావు; కాకూడదు కూడా.

సంగీతానికి సాహిత్యం ఒక వాహకం మాత్రమే! సాహిత్యం లేకపోయినా సంగీతం మనగలదు.

పేరుపొందిన విద్వాంసులు కూడా త్యాగరాజు కృతులు పాడేటప్పుడు సాహిత్యం తప్పుగా ఉచ్ఛరిస్తారు.
పదాలని విరవకూడని చోట విరుస్తారు.

అంతెందుకు? అందరికీ తెలిసిన “సామజ వరగమనా” పాట ( సినిమాది కాదు; కచేరీల్లో పాడినది ) వినండి.
ఒక చరణంలో–సామని గమజ సుధా–అని పాడతారు.
సాహిత్యాన్ని పట్టించుకుని పాడాలంటే–సామ నిగమజ సుధా–అని పాడాలి.

పేరొందిన సంగీతజ్ఞులు కూడా ‘సామని గమజ సుధా’ అనే పాడతారు.
బాలమురళి మొదట్లో అందరిలాగా పాడినా, తరువాత సవరించుకుని సాహిత్య ప్రకారమే పాడారు.

‘బంటురీతి కొలువూ ఇయ్యవయ్య రామా’ కృతిలోనో ఇలాంటి తప్పిదాలే దొర్లుతాయి.

వ్యక్తిగత అయిష్టాలతో రోడ్డెక్కి సంగీతానికి తామే గుత్తేదారులనుకోవడం ఎవరికీ మేలు చేయదు.


06 April 2024 12:58 AM